చీపురు పట్టిన "మాస్టర్ బ్లాస్టర్"

SMTV Desk 2017-09-26 12:47:11  Swaccha bharat, Sachin Tendulkar,PM Modi.

ముంబై, సెప్టెంబర్ 26 : స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన "స్వచ్ఛతా హీ సేవ" అనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రానున్న గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించేందుకు.. అందరు ఈ సేవలో పాల్గొనాలని తెలిపారు. అయితే భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మోడీకి తన పూర్తి మద్దతును తెలియజేశారు. అనుకున్నదే తడవుగా ఈ ఉదయం ముంబై వెస్ట్ బాంద్రా ప్రాంతంలో చీపురు పట్టి వీధులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని తెలియజేస్తూ మోదీ చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా "స్వచ్ఛతా హీ సేవ" కార్యక్రమంలో భాగం కావాలంటూ ఇటీవల మోదీ పలువురు ప్రముఖులకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.