తుది అంకానికి చేరిన టెక్స్ టైల్ పాలసీ

SMTV Desk 2017-06-06 14:02:16  textiles, minister, pushpasubramanyam, policy

హైదరాబాద్, జూన్ 6 : జాతీయ టెక్స్ టైల్ పాలసీ తుద్ది అంకానికి చేరిందని కేంద్ర టెక్స్ టైల్ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి పుష్పసుబ్రమణ్యం వెల్లడించారు. ఈ పాలసీని జూలై లో కేంద్ర క్యాబినెట్ కు పంపనున్నట్లు, సోమవారం హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా బేగంపేట లోని మీడియా ముందు మాట్లడుతూ టెక్స్ టైల్ పాలసీ చేనేత, జౌళి సంపద కార్మికులు, భారీ కంపెనీల అభిప్రాయాలను సేకరించామన్నారు. తుది ఆమోదం పొందాక 2024-25 నాటికి ఎగుమతులు రూ.20 లక్షల కోట్లకు పెరుగుతాయని అంచనా వేస్తు 3.50 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని అంచనాతో వెల్లడించారు. ఈ నెల 30 నుంచి జూలై 2 వరకు గుజరాత్ లోని గాంధీనగర్ లో టెక్స్ టైల్ ఇండియా-2017 పేరుతొ మెగా టెక్స్ టైల్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో నిర్మించడానికి తలపెట్టిన మెగా టెక్స్ టైల్ పార్క్ కు సాయం కోసం ప్రతిపాదన అందితే సానుకూలంగా పరిశీలిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ఫైబర్ టు ఫ్యాబ్రిక్ టెక్స్ టైల్ పార్క్ టెక్స్ టైల్ రంగానికి కీలకంగా మారుతుందని, దీని కోసం నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.