జికా వైరస్ వ్యాప్తితో ప్రారంభమైన వణుకు

SMTV Desk 2017-05-28 12:44:04  zika virus,zika in india,ahamadabad spred in zika

ప్రపంచాన్ని కుదిపేసిన జికా వైరస్ వ్యాప్తి భారత్ లో మెుదలవడంతో జనం గజగజ వణికిపోతున్నారు.దేశంలోని అహ్మదాబాద్ లో ముగ్గురికి వైరస్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడంతో ఆందోళనలు మిన్నుముట్టాయి.ఆ ముగ్గురిలో ఒకరు గర్భిణి కావడం మరింత ఆందోళన కలిగించే విషయం.గర్భిణిలకు జికావైరస్ సోకడం ద్వారా జన్మించే సంతానంలో పలు లోపాలు తలెత్తుతాయి.ముఖ్యంగా చిన్నతల ,మెదడు వంటి వాటితో జన్మించడం తో పాటు మానసిక వికలాంగులుగా ఉంటారని,అంధత్వం, మూర్చ,ఇతర వ్యాధులు సంబవిస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.దీన్ని వైద్యపరిబాషలో మైక్రోసేపాళి అంటారు.ప్రస్తుతం వ్యాప్తి నామమాత్రంగా ఉన్న వెంటనే అప్రమత్తం అయి నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్రప్రభుత్వానికి డబ్లు హెచ్ఓ సూచించింది.