నా లక్ష్యం అవార్డులు కాదు: రాజమౌళి

SMTV Desk 2017-09-25 21:48:15  baahubali the conclusion, newton, rajamouli, interview, baahubali

హైదరాబాద్ సెప్టెంబర్ 25: ఈ సంవత్సరం మన దేశంలో విడుదలై అత్యధిక వసూల్లను సాధించిన చిత్రం ‘బాహుబలి-2’. అయితే ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలవలేదు. ఆస్కార్ రేసులో ‘బాహుబలి’ చిత్రం కాకుండా బాలీవుడ్ మూవీ ‘న్యూటన్’ ఎన్నికైంది. అయితే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ‌మౌళి ఈ విషయం గురించి మాట్లాడుతూ... త‌న సినిమా ఆస్కార్ రేసులో నిల‌వ‌క‌పోవ‌డంపై తాను అసంతృప్తిగా ఏమీ లేనని అన్నారు. తన సినిమాలు అవార్డులు తెచ్చిపెట్టడం కాదని, అభిమానులకు నచ్చి, నిర్మాతలకు డబ్బులు తెచ్చిపెట్టడమే తన లక్ష్యం అన్నారు. తరువాత తీయబోయే సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులను చేరేలా చూస్తాన‌ని రాజమౌళి అన్నారు.