వార్తా ఛానల్ వ్యవస్థాపకుడి ఇంటిపై దాడి చేసిన సీబీఐ అధికారులు

SMTV Desk 2017-06-06 13:30:07  NDTV Chairman,Delhi,Dehradoon,CBI officer

న్యూఢిల్లీ, జూన్ 6 : బ్యాంకులో తీసుకున్న రుణాన్ని సరైన సమయంలో చెల్లించని కారణంగా బ్యాంకుకు నష్టం వాటిల్లిందనే అభియోగంపై ప్రముఖ వార్తా ఛానెల్ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. సంస్థకు చెందిన ఇతర కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేపట్టింది. ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధిక, వారికి చెందిన ఆర్ఆర్ పీ ఆర్ హోల్డింగ్స్, కొందరు ఐసీఐసీఐ బ్యాంకు అధికారులపై నేరపూరిత కుట్ర, అవినీతి, మోసం కింద కేసులు నమోదు చేసిన సీబీఐ సోమవారం ఈ దాడులు జరిపింది. ఢిల్లీలోని రెండు ప్రాంతాలు, డెహ్రాడూన్, ముస్సోరిల్లో తమ బృందాలు సోదాలు చేసినట్టు సీబీఐ అధికారి సుజిత్ కుమార్ వివరించారు. నిబంధనల ఉల్లంఘనలతో ఐసీఐసీఐ బ్యాంకుకు 48 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని.. పర్యవసానంగా ఆర్ఆర్ పీ ఆర్ లాభం పొందిదని సీబీఐ ఎఫ్ఐఆర్ లో తెలిపింది. రాజకీయ జోక్యం ఉందన్న టీవీ యాజమాన్యం : పత్రికా స్వేచ్చను అడ్డుకోవడానికి, ప్రభుత్వం ఈ విధంగా రాజకీయ దాడికి పాల్పడిందని ఎన్డీటీవీ వెల్లడించింది. ఇలాంటి చర్యలతో అధికార పార్టీ నాయకులు తమను భయపెట్టలేరంది. ఐసీఐసీఐ నుంచి తీసుకున్న రూ. 375 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించలేదని సీబీఐ ఆరోపిస్తుందని, కాని ఏడేళ్ళ క్రితం ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేశామని యాజమాన్యం వాదిస్తుంది.