‘రాణి పద్మావతి’ భర్త వచ్చేశాడు..

SMTV Desk 2017-09-25 15:28:10  deepika padukone, padmavathi first look, sanjayleela bhansali, shahid kapoor

ముంబాయి, సెప్టెంబర్ 25: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపిక పదుకొణె, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో ‘పద్మావతి’ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల ఈ చిత్రంలోని ‘రాణి పద్మావతి’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో దీపిక పదుకొణె మహారాణి లుక్ తో అందరిని ఆకట్టుకోటో౦ది. తాజాగా ఈ రాణి పద్మావతి భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో షాహిద్‌ కపూర్ ఒంటి నిండా గాయాలు, దైన్యం నిండిన కళ్లతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తో౦ది. ఇప్పటికే ఈ ఫస్ట్‌లుక్‌ ట్విట్టర్ ట్రెండింగ్‌ టాప్‌లో దూసుకెళ్తోంది. ఇక ఖిల్జి పాత్రలో రణ్‌వీర్‌ ఎలా ఉండబోతున్నాడోనని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.