అమెరికా వీసాల పై సందేహాల నివృతి

SMTV Desk 2017-06-06 13:16:43  amerika visa day 8th june , recollection of doubts

హైదరాబాద్, జూన్ 6 : అమెరికా వీసాలపై విద్యార్ధులకు అవగాహన కోసం సందేహాల నివృత్తి దరఖాస్తులకు సంబందించిన అంశాలపై సమాధానం ఇచ్చేందుకు హైదరాబాద్ రాయబార కార్యాలయం వద్ద ఈ నెల 8న వీసా డే గా నిర్వహిస్తున్నది. బేగం పేటలోని కార్యాలయంలో కాన్సులర్ సెక్షన్ చీఫ్ డోనాల్డ్ ముల్లిగన్, నాన్ ఇమ్మిగ్రెంట్స్ చీఫ్ బ్రియాన్ సాల్వేర్షన్ సందేహాలను నివృత్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ నుంచి అమెరికాలో విద్యాభ్యాసం చేయాలనుకున్న విద్యార్ధులకు ఓ అవగాహన కల్పించేందుకు సందేహాలను నివృత్తి చేసుకోవాలని రాయబార కార్యాలయం సోమవారం రోజున ఒక ప్రకటనలో వెల్లడించారు.