కాశ్మీర్ పై అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం ఉండదు : సుష్మ

SMTV Desk 2017-06-06 13:15:38  Kajakisthan,India,Pakistan,Modi, Navaz sharref

న్యూఢిల్లీ, జూన్ 6 : కజకిస్తాన్ లో త్వరలో జరగబోయే షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం సందర్బంగా భారత ప్రధాని మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీప్ మధ్య భేటీ జరగబోదని విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదం, చర్చలు ఒకదానితో పాటు మరొకటి కలిసి కొనసాగలేవన్నారు. ఎన్డీయే ప్రభుత్వం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాశ్మీర్ విషయం అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తామన్న పాకిస్తాన్ వ్యాఖ్యలను సుష్మ ఖండించారు. కాశ్మీర్ సమస్యకు ఇతర దేశాల మధ్యవర్తిత్వం లేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారమని సిమ్లా ఒప్పందం , లాహోర్ వివరణ స్పష్టం చేస్తున్నాయని సుష్మ వివరించారు. పారిస్ ఒప్పందం విషయంలో భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను సుష్మ తీవ్రంగా ఖండించారు. డబ్బుల కోసమో .. ఇతరుల ఒత్తిడి వల్లో భారత్ ఈ ఒప్పందంపై సంతకం చేయలేదని, పర్యావరణ పరిరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం. పర్యావరణంపై 5 వేల ఏళ్ల నిబద్దత ఉందని ఆమె స్పష్టం చేశారు.