హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు అరుదైన గుర్తింపు

SMTV Desk 2017-09-25 11:37:42  Rajiv Gandhi International Airport, Wheelchair lift, International Airport Limited, CEO SGK Kishore.

హైదరాబాద్, సెప్టెంబర్ 25 : "రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం" అరుదైన గుర్తింపు సాధించింది. యాక్సెస్‌బుల్ ఇండియా ప్రచారంలో భాగంగా.. "వీల్‌చైర్ లిఫ్ట్ (వెర్టి-లిఫ్ట్)" ను ప్రవేశపెట్టిన భారతీయ తొలి విమానాశ్రయంగా గుర్తింపును దక్కించుకుంది. వికలాంగులకు, వృద్దులకు మొదటి ప్రాధాన్యతను ఇస్తూ.. వారి సమయాన్ని ఆదా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ లిఫ్ట్ ను ప్రవేశపెట్టినట్లు విమానయాన అధికారులు వెల్లడించారు. ఈ సదుపాయం గురించి జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సీఈవో ఎస్‌జీకే కిషోర్ స్పందిస్తూ.. ప్రయాణికుల సౌకర్యార్ధం "వీల్ చైర్ లిఫ్ట్" ను ప్రవేశపెట్టిన౦దుకు మంచి గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని, వారికి నా అభినందనలు అంటూ తెలియజేశారు.