"బిగ్ బాస్" తెలుగు విజేతగా.. శివబాలాజీ

SMTV Desk 2017-09-24 23:15:33  bigg boss show, final episode, bigg boss telugu winner, jr ntr, shiva balaji

హైదరాబాద్ సెప్టెంబర్ 24: "బిగ్ బాస్" కార్యక్రమం మొదటి సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు స్టార్ మా యాజమాన్యం. ఈ ఆదివారంతో ముగిసిన మొదటి సీజన్ బుల్లితెరలో మంచి ప్రేక్షకాదరణను పొందింది. అయితే బిగ్ బాస్’ ఫైనల్ లో శివబాలాజీ, ఆదర్శ్ నిలిచారు. కాగా ‘బిగ్ బాస్ మొదటి సీజన్’ విజేత గా శివబాలాజీ గెలుపొందారు. ‘ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’ ట్రోఫీని, మనీ ప్రైజ్ ని జూనియర్ ఎన్టీఆర్ శివబాలాజీ కి అందజేశాడు. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన అందరు ఆర్టిస్ట్ లు వచ్చారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆనందభరితంగా జరిగింది. ఎలిమినేట్ అయిన ఆర్టిస్ట్ లకు ఎన్టీఆర్ ఫన్నీ అవార్డులను అందజేశారు.