చిరుతను వశపరచుకున్న అటవి అధికారులు

SMTV Desk 2017-06-06 13:05:39  Forest area,Medak district,Chinnashakarampet,Kaamaram

చిన్న శంకరంపేట(మెదక్), జూన్ 6 : అటవీ ప్రాంతం దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలకు భయబ్రాంతులకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు చేజికించుకున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం కామారం తండాకు చెందిన రైతు లంబాడి హరికి చెందిన లేగదూడను చిరుత చంపివేసింది. ఇది హైనానా.. చిరుతనా అని తెలియక దానిని రుజువు చేసేందుకు అధికారులు ఆదివారం రాత్రి కామారం శివారులోని అటవీ ప్రాంతంలో మాటు వేశారు. బోనును ఏర్పాటు చేసి అందులో లేగదూడ కళేబరాన్ని ఉంచగా, రెండవరోజు కూడా లేగదూడ మాంసం తినడానికి వచ్చిన చిరుత బోనులోకి వెళ్ళింది. దానితో అప్రమత్తమైన అధికారులు బోనులో చిరుతను బంధించి వల్లూర్ ఫారేస్ట్ అధికారులను సమాచారం అందించగా వాళ్ళు ప్రత్యేక వాహనంలో చిరుతను పోచారం అభయారణ్యానికి తీసుకెళ్ళారు.