డేరా బాబాను పెళ్లి చేసుకుంటానన్న.. రాఖీ

SMTV Desk 2017-09-24 14:02:09  BOLLYWOOD ACTRESS, RAKHI SAWANT, GURMITH SINGH BABA, HONEY PREETH.

ముంబై, సెప్టెంబర్ 24 : వివాదస్పద డేరా బాబా గుర్మీత్ జీవితంపై ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో డేరా దత్తత పుత్రిక హనీప్రీత్ పాత్రలో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా "ఎ డైలాగ్‌ విత్‌ జేసీ" అనే కార్యక్రమంలో పాల్గొన్న రాఖీ.. పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు గుర్మీత్ సింగ్ కు దాదాపు మూడేళ్ళ పరిచయం ఉందని, చాలా సార్లు వారిని కలిసినట్లు వెల్లడించింది. ఓసారి బాబా తన పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానిస్తే డేరా ఆశ్రమానికి వెళ్ళినట్లు తెలిపింది. అక్కడకు వెళ్ళడం హనీప్రీత్ కు నచ్చేది కాదని, తాను ఆయనకు దగ్గరై, ఎక్కడ గుర్మీత్ ను పెళ్లి చేసుకు౦టానో అన్న భయంతో అస్సలు కలవనిచ్చేది కాదని వివరించింది. కాని గుర్మీత్ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తాడని ఊహించలేదని స్పష్టం చేసింది.