గవర్నర్ తో కేసీఆర్ భేటీ..

SMTV Desk 2017-09-24 12:44:21   Governor, Narasimhan, Cm KCR, Raj Bhavan

హైదరాబాద్, సెప్టెంబర్ 24 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో నిన్న సాయంత్రం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో.. తెలంగాణలో సమగ్ర భూ సర్వేకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని గవర్నర్ కు కేసీఆర్ విన్నవించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ముందుగా గవర్నర్ కు బతుకమ్మ, నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. తొలుత తన మిత్రుడైన పారిశ్రామికవేత్త నర్సింహనాయుడిని గవర్నర్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... " భూ రికార్డుల ప్రక్షాళన వేగవంతంగా సాగుతోంది. ఈ ప్రక్రియ డిసెంబరు వరకు పూర్తి చేస్తామన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేసిన కార్యక్రమం విజయవంతమైంది" అని అన్నారు. అంతేకాకుండా మిషన్‌ భగీరథ పనులు డిసెంబరు 31నాటికి పూర్తి చేసి ప్రతి ఇంటికి రక్షిత మంచి నీరు అందిస్తామని వెల్లడించారు. కాగా మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్‌ను ఆహ్వానించారు.