మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో

SMTV Desk 2017-09-24 07:02:42  shirija husband, mega family, kalyan, chiranjeevi

హైదరాబాద్ సెప్టెంబర్ 24: మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడు, ఆ హీరో ఎవరో కాదు చిరంజీవి చిన్న కూతురు భర్త కళ్యాణ్. మొదటి నుంచి అతని మనసు సినిమాల వైపే ఉంది, కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఈ కుర్రోడు.. ఈ మధ్యే అతని సినిమా కి సంబదించిన సన్నాహాలు మొదలయ్యాయి. కళ్యాణ్ కూడా హీరో అయ్యేందుకు అన్నివిధాల సరిపోతాడని సినివర్గాల సమాచారం. ఇప్పటికే విశాఖలోని సత్యానంద్ దగ్గర నటనలో మూడు నెలల పాటు శిక్షణ తీసుకోవడం తో పాటు పర్సనాలిటీ పరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. అలాగే తనకు కావల్సిసిన కథలను వింటున్నాడని, త్వరలోనే మంచి కథను ఓకే చేసే ఛాన్స్ ఉందని, ఈ దీపావళి తరువాత కళ్యాణ్ హీరోగా కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం.