పాలిటెక్నిక్ తరగతులు ప్రారంభం

SMTV Desk 2017-06-06 12:21:45  polytechnic, classes, admissions, technical education traing ,

హైదరాబాద్, జూన్ 6 : కొత్తగా పాలిటెక్నిక్ లలో చేరే ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఈనెల 14 నుండి, మిగతా సెమిస్టర్ల వారికి ఈనెల 9 నుంచి తరగతులను ప్రారంభిస్తామని సాంకేతిక విద్యా శిక్షణ మండలి వివరించింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుండి ప్రథమ సంవత్సరంలోనూ సెమిస్టర్ విధానం అమల్లోకి తేనున్నట్లు పేర్కొంది. తెలుగు మీడియం నుంచి వచ్చిన విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సు మెటీరియల్ సిద్ధం చేస్తున్నట్లు వివరించింది. ప్రిన్సిపాళ్లు మెుదటి రోజు నుంచే విద్యా కేలండర్ ను అమలు చేయాలని తెలిపింది. ఆధార్ ఆధారిత బయో మెట్రిక్ హాజరు విధానం ఖచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది.