ఉత్తరకొరియాలో నమ్మలేని నిజాలు...

SMTV Desk 2017-09-23 16:02:29  North Korea, South Korea, President, Kim Jong-un

ఉత్తరకొరియా, సెప్టెంబర్ 23 : ఉత్తరకొరియాలో మహిళలు భయంకరమైన నరకాన్ని అనుభవిస్తున్నారని.. ఆ దేశం నుండి తప్పించుకొని వచ్చిన మహిళ అక్కడి బాహ్య ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్లు వివరించింది. వివరాలలోకి వెళితే... హీయోన్ లిమ్(26) అనే యువతిని కిమ్ సైన్యం తనను టీనేజ్ లో ఉండగా ఎత్తుకెళ్ళారని, ఆ తర్వాత కిమ్ పరివారం అంతా కలిసి ఆమెపై లైంగిక దాడి చేస్తూ బానిసగా మార్చారని.. ప్రతి ఇంటికి తిప్పుతూ నిత్యం ఒకరి తర్వాత ఒకరు నరకం చూపిస్తున్నారని ఆమె ఆవేదన వక్త్యం చేసింది. ఇంకా తనలాంటి వారు అక్కడ చాలా మంది బానిసలుగా మగ్గిపోతున్నారని తెలిపింది. అంతేకాకుండా వారంతా నరకం అనుభవిస్తూ.. నలిగిపోతుంటే కిమ్ పరివారం మాత్రం సంతోషంతో మరింత రెచ్చిపోతారని అసహనం వ్యక్తం చేసింది. తమకు నచ్చినట్టు నడుచుకోకపోయినా, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా, గర్భం దాల్చినా వారిని అంతం చేసేందుకు కూడా వెనకాడరని వెల్లడించింది. ఓసారి సంగీత బృందంలోని 11 మంది సభ్యులు అసభ్యకర సైట్స్ చూసారన్న నెపంతో వారిని పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్ గన్ తో అతి దారుణంగా కాల్చి చంపి, అనంతరం వారి శరీరాలను ఆర్మీ యుద్ధ ట్యాంకులతో తొక్కించారని తెలిపింది. ఎవరైనా కిమ్ జాంగ్ ఉన్ కు విశ్వాసంగా లేరని అనిపిస్తే చాలు వారిని అక్కడిక్కడే ఉరితీస్తారని.. అతి కష్టం మీద ఉత్తరకొరియా నుండి దక్షిణ కొరియాకు తప్పించుకొని వచ్చి ప్రస్తుతం సియోల్ లో ఉంటున్నట్లు ఆమె వెల్లడించింది.