సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

SMTV Desk 2017-09-23 10:59:46  Singareni , jobs notification, Singareni CMD N. Sridhar, Cm Kcr.

హైదరాబాద్, సెప్టెంబర్ 23 : తెలంగాణలో సింగరేణి యాజమాన్యం నిరుద్యోగ యువకులకు ఓ శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని దానికి అనుగుణంగా సింగరేణి సంస్థ ఈ మేరకు 750 ఉద్యోగాల భర్తీకి గాను నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కార్మిక శ్రేణి ఉద్యోగాలు 643 ఉండగా.. అధికారిక శ్రేణి ఉద్యోగాలు 107 ఉన్నాయి. అయితే ఆయా ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 25 వ తేదీ నుండి అక్టోబర్ 10 వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుందని సింగరేణి సీఎండీ యన్. శ్రీధర్ తెలియజేస్తూ దీనికి సంబంధించిన మిగతా వివరాలన్నీ www.scclmines.com అనే వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే సింగరేణి 5,793 ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం తెలిసిందే.