‘బిగ్ బాస్’ చివరి ఎపిసోడ్...ఈ ఆదివారమే

SMTV Desk 2017-09-23 07:52:42  bigg boss show, jr ntr, final episode, star maa channel, salman, kamal hasan

హైదరాబాద్ సెప్టెంబర్ 23: ‘బిగ్ బాస్’ అనే కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన విషయం విదితమే. మనదేశం లో మొదటగా హిందీలో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాత గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి విశేషాదరణ లభించింది. ఇపుడు తమిళంలో కమల్ హసన్ , తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతలు గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్టార్ టీవీ ఛానల్లలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమాలు మొదటి నుంచి కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగులో ముఖ్య హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తోన్న ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ ఆదివారమే చివరి ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది. అయితే ఈ చివరి ఎపిసోడ్ ను మరింత ఆసక్తికరంగా .. ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తునట్టు నిర్వాహకుల నుంచి సమాచారం. ప్రత్యేకంగా ఆ రోజు నాలుగు గంటల పాటు ఏకధాటిగా ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ప్రసారం చేస్తామని, ఇంతకు ముందు బిగ్ బాస్ హౌస్ లో నుంచి వెళ్లిన వాళ్లందరినీ ఈ ఫైనల్ ఎపిసోడ్ కి పిలిపిస్తున్నారని తెలియజేసారు. మరి ఎవరు ‘బిగ్ బాస్’ కార్యక్రమం విజేత గా నిలవనున్నారో తెలుసుకోవాలంటే మాత్రం ఈ ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.