అబద్ధపు ప్రచారాలతో కేసీఆర్‌ సర్కారు ప్రజలను మోసం చేస్తుంది : ఉత్తమ్‌

SMTV Desk 2017-09-22 18:57:11  warangal, uttamkumar reddy, KCR, Telangana government

వరంగల్, సెప్టెంబర్ 22: వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం భీమారంలో జరిగిన ఇందిరమ్మ రైతు బాట కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కేసీఆర్‌ సర్కారు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. రుణ మాఫీ వల్ల అసలు ప్రయోజనం లేకపోగా అన్నదాతలపై వడ్డీ భారం పడిందని, పంట పండించే ప్రతి రైతుకు రూ. 4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నాసిరకం పనుల వల్ల 8 మంది మృత్యువాత పడ్డారని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్లపై పోరాటంలో భాగంగా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వానికి దరఖాస్తులు చేయించాలని కార్యకర్తలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు భట్టి విక్రమార్క, కె. రాజు, మల్లు రవి, బలరాం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.