దేశంలో జికా వైరస్ వణుకు

SMTV Desk 2017-05-28 12:24:35  zika virus, in india, WHO

మహారాష్ట్ర, మే 26 : ప్రపంచాన్ని కుదిపేసిన జికా వైరస్ వ్యాప్తి భారత్ లో మెుదలవడంతో జనం గజగజ వణికిపోతున్నారు. దేశంలోని అహ్మదాబాద్ లో ముగ్గురికి వైరస్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడంతో ఆందోళనలు మిన్నుముట్టాయి. ఆ ముగ్గురిలో ఒకరు గర్భిణి కావడం మరింత ఆందోళన కలిగించే విషయం. గర్భిణిలకు జికావైరస్ సోకడం ద్వారా జన్మించే సంతానంలో పలు లోపాలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్న తల, మెదడు వంటి వాటితో జన్మించడంతో పాటు మానసిక వికలాంగులుగా ఉంటారని, అంధత్వం, మూర్చ, ఇతర వ్యాధులు సంభవిస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. దీన్ని వైద్య పరిబాషలో మైక్రోసెపాళి అంటారు. ప్రస్తుతం వ్యాప్తి నామమాత్రంగా ఉన్న వెంటనే అప్రమత్తం అయి నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి డబ్లుహెచ్ఓ సూచించింది.