పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ అగ్రస్థానం: కేటీఆర్

SMTV Desk 2017-09-22 14:31:00  IT Minister KTR, Naiini Narasimeddy, Attractiveness of investments, Telangana state is the first

హైదరాబాద్, సెప్టెంబర్ 22 : దేశంలోనే పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ రాష్ట్రం అగ్ర స్థానంలో నిలిచిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నేడు రాజధానిలోని హెచ్‌ఐసీసీలో కార్మిక భద్రత, ఆరోగ్యం, పారిశ్రామిక అభివృద్ధి అంశంపై అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంత్రులు కేటీఆర్, నాయిని నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్రానికి 80 వేల కోట్ల పెట్టుబడులు రాగా, కొత్తగా 4300 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఈ మేరకు పలు సంస్థలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయన్నారు. ఇప్పటికే పెట్టుబడిదారులను టీఎస్ ఐపాస్ విధానం ఆకర్షిస్తుందని ఆయన తెలిపారు.