ఉగ్రవాదుల దాడికి ప్రతి దాడి

SMTV Desk 2017-06-06 11:22:35  terrorist,polics,jammukashmir

శ్రీనగర్, జూన్ 6 : జమ్ముకాశ్మీర్ లోని ఉగ్రవాదులు మరోసారి సీఆర్పీఎఫ్ క్యాంపు పై దాడికి పాల్పడ్డారు. బందిపొర జిల్లా సంబల్ లోని సీఆర్పీఎఫ్ 45 బెటాలియన్ ను లక్ష్యం గా చేసుకొని సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అయితే అప్రమత్తమైన భద్రతాబాలగాలు వారి మీదికి ఎదురుకాల్పులు జరుపడం తో నలుగురు ఉగ్రవాదులను మట్టికరిపించారు. ఉగ్రవాదులు భారీ ఆయుధాలు ధరించి సోమవారం తెల్లవారు జమున 4:10 గంటల సమయం లో సెంట్రి పోస్టు పైకి గ్రనేట్లు విసరారు. వెంటనే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ ఆర్మీ క్యాంప్ లోకి వచ్చారు. అప్రమత్తమైన బద్రత బలగాలు ఎదురు దాడి చేసారు. ఈ కాల్పులు దాదాపు 45 నిమిషాల పాటు జరిగింది. అందులో నలుగురు ఉగ్రవాదులు అక్కడిక్కడే హతమయ్యారు. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి కి పాల్పడాలనే ఉద్దేశం తోనే సీఆర్పీఎఫ్ క్యాంపు పై దాడి చేసారని పోలీసులు చెబుతున్నారు. మృతి చెందిన ఉగ్రవాదుల దగ్గర ఏకే 47 తుపాకులు, ఒక యుబీజీఎల్ (అండర్ బ్యారెల్ గ్రనేట్ లాంచర్) తో పాటు 12గ్రనేడ్లు, మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాశ్మీర్ లో ఉగ్రవాద చర్యలకు నిధులు సమకుర్చుతున్నరనే ఆరోపణల తోనే పాకిస్తాన్ సానుభూతిపరుల ఇళ్ళల్లో సోదాలు నిర్వహిస్తున్న సమయం లో ఈ దాడి జరిగింది. యూరి తరహాలో దాడికి పాల్పడాలన్న ప్రణాళికతోనే ఉగ్రవాదులు క్యాంప్ లోకి చొరబడి రోజులతరబడి కాల్పులను చేయాలనీ ప్రణాళిక వేసుకొని వచ్చారని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలుపారు. కాని మన భద్రతా దళాలు వారి ఆటలను సగానివ్వలేదని చెప్పారు.