అమెజాన్ ద్వారా స్మార్ట్ ఫోన్

SMTV Desk 2017-06-06 11:12:03  amazon smart phones, smar phones, redey to amazon smart phone

హైదరాబాద్, జూన్ 6: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్ ఫోన్ల విక్రయానికి రంగం సిద్ధం చేసింది. ఆ సంస్థ సొంతం బ్రాండ్ తో స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది.ఐస్ బ్రాండ్ తో వీటిని విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా వెల్లడవుతోంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు లక్ష్యంగా గూగుల్ కొత్త ఆన్ డ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో స్మార్ట్ ఫోన్లను ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. జీమెయిల్, గూగుల్ ప్లే వంటి గూగుల్ యాప్స్ ను ఇన్ బిల్ట్ గా ఇవ్వనుంది. 5.2 నుండి 5.5 అంగుళాల స్ర్కీన్ తో 13 ఎంపీ కెమెరా, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, గూగుల్ అసిస్టెంట్ తో ఆన్ డ్రాయిడ్ 7.1.1 ఆపరేటింగ్ సిస్టమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉండ నున్నాయని తెలుస్తోంది. ధర 6 వేల వరకు ఉండొచ్చని సమాచారం. 2014 లో అమెజాన్ ఫైర్ ఫోన్ పేరుతో ఆన్ డ్రాయిడ్ స్మార్ట్ పోన్ ను విడుదల చేసింది. కస్టమర్ల నుంచి స్పందన అంతంతే ఉండడంతో వీటి తయారీని నిలిపివేసింది.