తారక్... నీ నటన అద్భుతం : రాజమౌళి

SMTV Desk 2017-09-21 15:30:58  Jr. NTR, Jai lavakusa movie, Directer S. S. Rajamouli, Raashi Khanna, Niveda Thomas

హైదరాబాద్, సెప్టెంబర్ 21 : ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న "జై లవకుశ" ప్రపంచ వ్యాప్తంగా విడుదలై౦ది. ఈ చిత్రంలో తారక్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారట. మూడు విభిన్నమైన పాత్రలలో ఎన్టీఆర్ చాలా అద్భుతంగా నటించాడని, ముఖ్యంగా ఆయన డాన్సులు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చిత్రాన్ని చూసిన టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ... "తారక్.. ఈ సినిమా చూసి నా హృదయం గర్వంతో నిండిపోతోంది. నీ నటనను వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు. జై.. జై.." అంటూ ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో యాక్షన్, ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎమోష‌న‌ల్ సన్నివేశాలన్నింటిని చూడొచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఈ చిత్రంలో రాశికన్నా, నివేదా థామస్ కథానాయికలుగా నటించారు.