రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసిన విజయ్ దేవరకొండ..!

SMTV Desk 2017-09-21 13:32:03  VIJAY DEVARAKONDAA, REMUNERATION, ARJUN REDDY MOVIE, SHOP OPENING FUNCTIONS.

హైదరాబాద్, సెప్టెంబర్ 21 : "అర్జున్ రెడ్డి" సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఘన విజయ౦ సాధించి.. రికార్డులు సృష్టించిన తరుణంలో ఒక్కసారిగా దర్శక నిర్మాతల చూపు ఆయన మీద పడింది. దీంతో విజయ్ పారితోషికం అమాంతం పెంచేశాడని, వ్యాపార ప్రకటనలకు.. షాప్ ఓపెనింగ్ కార్యక్రమాలకు ఎక్కువ మొత్తం తీసుకుంటున్నాడనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ విషయంపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. " నాకు నచ్చని వాటిని వద్దని చెప్పలేక ఇలా వ్యాపార ప్రకటనల విషయంలో అవతలి వారికి భారీ రేటు చెప్పి వారు వెనక్కి తగ్గేలా చేస్తున్నానని అన్నాడు. పారితోషికం విషయానికి వస్తే.. తానూ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, ఎన్నో కష్టాలను అనుభవించి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్నానని తెలిపాడు. కాబట్టి తన పారితోషకం పెంచడం సరైన నిర్ణయమే" అని చెప్పుకొచ్చాడు.