మోడీని మెచ్చుకొని..స్వీయ విమర్శ చేసుకున్న రాహుల్...!

SMTV Desk 2017-09-21 12:34:35  modi, prime minister modi, Raul Gandhi,

న్యూయార్క్ సెప్టెంబర్ 21: ప్రధాని మోదీని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మెచ్చుకున్న సంఘటన నిన్న న్యూయార్క్ నగరంలో చోటుచేసుకుంది. సహజంగా ఒక పార్టీలో ఉన్న నాయకులు మరో పార్టీ నాయకులను మెచ్చుకోవడం లాంటి ఘటనలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎల్లప్పుడూ మోడీపై విమర్శనాస్త్రాలను సంధించే రాహుల్ గాంధీ న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘మేక్‌ ఇన్‌ ఇండియా నాకు బాగా నచ్చిందని, కానీ దాని అమలే సరైన పద్ధతిలో కొనసాగడం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేకపోయిందని స్వీయ విమర్శ చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో మోదీ కేవలం పెద్ద తరహా పరిశ్రమలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని, మధ్య, చిన్న తరహా పరిశ్రమలను కూడా ఈ కార్యక్రమంలో చేర్చితే గ్రామీణ నిరుద్యోగులకు అవకాశాలు దక్కేవని అన్నారు. అయితే ఈ అంశాన్ని రాజకీయ కోణంలో పరిశీలిస్తే..ప్రతిపక్ష హోదాలో కొనసాగుతున్న రాహుల్ మోడీ పనితీరును ప్రశంసించిన తీరు రాహుల్ లో రాజకీయ పరిణితిని పెంచిందని ఇలాంటి వ్యక్తిత్వమే మనుషులను ఉన్నత స్థాయికి చేర్చుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.