గుర్మీత్ డేరాలో వందల సంఖ్యలో అస్థిపంజరాలు..!!

SMTV Desk 2017-09-20 18:57:18  Gurmith singh baba, Skeletons in dera, Chairperson Vipasana, SIT Officers.

హర్యానా, సెప్టెంబర్ 20 : గుర్మీత్ సింగ్ బాబా చేసిన పాపాల గురించి రోజు రోజుకి నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సిర్సాలోని డేరా ఆశ్రమంలో అస్థిపంజరాలు ఉన్నట్లు స్వయంగా గుర్మీత్‌ మద్దతుదారుడే తెలియజేయడం విశేషం. ఈ డేరాలో సుమారు 600 అస్థిపంజరాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపధ్యంలో సిట్‌ అధికారుల బృంద౦ డేరా చైర్‌పర్సన్‌ విపాసనను, మాజీ సభ్యుడు డా. పి.ఆర్‌. నైన్‌ ను విచారించగా... జర్మనీకి చెందిన ఓ శాస్త్రవేత్త సలహా మేరకు అస్థిపంజరాలను పాతి పెట్టిన స్థలంలో మొక్కలు నాటినట్లు వెల్లడించారు. గతంలో కూడా దాదాపు వందల సంఖ్యలో అస్థిపంజరాలను గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. కాగా డేరా బాబా హత్యలు చేసి ఆ మృతదేహాలను డేరాలో దాచాడా..! అన్న కోణంలో సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం గుర్మీత్ ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచార౦ చేసిన కేసులో 20ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.