స్వీయ శిక్షను విధించుకున్న ప్రజాప్రతినిధి

SMTV Desk 2017-06-05 20:07:45  Corporator,TDP,Mee kosam, officers

అనంతపురం, జూన్ 5 : అధికారంలో ఉన్నాం కదా అని కొందరు ప్రజాప్రతినిధులు తమ మాటను వినని అధికారులను ఒక చోటు నుంచి మరో ప్రదేశానికి బదిలీ చేస్తుంటారు. కాని ఒక ప్రజాప్రతినిధి మాత్రం ఆ విధంగా చేయకుండా, భిన్నంగా ప్రవర్తించాడు. అధికారుల తీరుపై అసహనంతో తనను తానే చెప్పుతో కొట్టుకున్నాడు ఓ కార్పోరేటర్. వివరాల్లోకెళితే.. సోమవారం నగరంలో ‘మీకోసం’ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన 29వ డివిజన్ టీడీపీ కార్పోరేటర్.. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. డివిజన్‌లో సమస్యలు పరిష్కారించాలని కోరినా, అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన చెప్పుతో తననే కొట్టుకున్నాడు. దీంతో అవాక్కవడం అక్కడి ప్రజల వంతైంది. వెంటనే స్పందించిన అధికారులు ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.