రైలు కింద పడి బ్రతికిన అమ్మాయి

SMTV Desk 2017-06-05 19:10:00  mumbai,kurla railway station,girl

ముంబాయి, జూన్ 5 : రోజు ట్రైన్ కింద పడి చాల మంది చనిపోతుంటారు. రైల్వే ట్రాక్ దాటుతూ అనుకోకుండా చనిపోతుంటారు. కానీ ఇలాగే ఒక అమ్మాయి రైల్వే ట్రాక్ దాటుతూ ఒక్క సారిగా ఆమె మీది నుంచి ట్రైన్ వెళ్ళిన ఆమె బ్రతికే ఉంది. ఈ ఘటన ముంబాయి లోని కుర్ల రైల్వే స్టేషన్ లో జరిగింది. బాండూప్ కు చెందిన ప్ర‌తిక్ష న‌టెక‌ర్ కుర్లాలోని త‌న స్నేహితురాలును ను క‌ల‌వ‌డానికి వ‌చ్చింది. తిరిగి బాండూప్ వెళ్ల‌డానికి కుర్లా స్టేష‌న్ లోని 7వ నెంబర్ రైల్వే ఫ్లాట్ ఫారం దాటబోయింది. చెవిలో ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకొని ఉండ‌టంతో ఆ ట్రాక్ పై వ‌చ్చే ట్రైన్ చూడ‌లేదు. ఫ్లాట్ ఫాం పై ఉన్న ప్ర‌యాణికులు ప్ర‌తిక్ష ను గ‌మ‌నించి అరుస్తున్న వినిపించుకోలేదు అంత‌లోనే ట్రైన్ త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చేసింది. డ్రైవ‌ర్ స‌డన్ గా బ్రేక్ వేసినా ట్రైన్ ఆగ‌లేదు. ఏం చేయాలో ప్ర‌తిక్ష‌కు అర్ధం కాలేదు. అంత‌లోనే ట్రైన్ వ‌చ్చి త‌న‌ను తాకడంతో ట్రాక్ మ‌ధ్య‌లో ప‌డిపోయింది. త‌న మీద నుంచి రెండు మూడు బోగీలు కూడా వెళ్ళిన తరువాత ట్రైన్ ఆగిపోయింది. ఇక అందరు ఆమె చనిపోయిందని భావించారు. అంతలోనే భ‌యంతో ఆమె అరుస్తున్న మాట‌లు విన్న వాళ్లు వెంట‌నే త‌న‌ను ట్రైన్ కింది నుంచి బ‌య‌ట‌కు లాగారు. ట్రైన్ బ‌లంగా తాక‌డంతో ఎడ‌మ క‌న్నుకు చిన్న‌గాయం అయింది అంతే కాని.. పెద్ద పెద్ద గాయాలు ఏం కాలేదు. వెంట‌నే ద‌గ్గ‌ర లో ఉన్న హాస్ప‌టల్ కు త‌ర‌లించారు.