పదోన్నతుల వివాదం పై హోంమంత్రి విచారణ

SMTV Desk 2017-06-05 19:09:33  homministare, nayeni narsimhareddy, promotions, inspectors to dsp promotions

హైదరాబాద్, జూన్ 5 : పోలీస్ శాఖలో రెంజ్ లు , బ్యాచ్ ల మధ్య వివాదానికి కారణమైన వ్యవహారం డీజీపి నుండి హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి వద్దకు చేరింది. ఇన్ స్పెక్టర్ నుండి డీఎస్పీ పదోన్నతి కోసం రూపొందించిన జాబితాపై 1991, 1995 బ్యాచ్ ల మధ్య వివాదం చెలరేగింది. ప్రధానంగా హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్లు, రేంజ్ లలో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్ల సీనియారిటిని సరిగ్గా లెక్కలోకి తీసుకోకుండా పదోన్నతులకు తెరలేపారని 1995 బ్యాచ్ అధికారులు ముఖ్యమంత్రి, హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. వరంగల్ రేంజ్, హైదరాబాద్ రేంజ్ డీఐజీలుగా పనిచేసిన అధికారులతో పాటు హోంమంత్రి నేతృత్వంలో ఏర్పాటైన కమిటి సమావేశం నిర్వహించారు. సమావేశానికి 91,95 బ్యాచ్ లకు చెందిన అధికారులు హజరయ్యారు. 14ఎఫ్ ఫ్రీజోన్ కింద ఏపికి చెందిన చాలా మంది హైదరాబాద్ స్థానికత పేరుతో పోలీస్ శాఖలో చేరారని, వారివల్ల తమ పదోన్నతులకు ఇబ్బంది ఎదురైందని 1995 బ్యాచ్ అధికారులు వాదించారు. సిటీ నియామకాలు, రేంజ్ నియామకాలు వేరుగా ఉన్నాయని, ఆ మేరకు ఎవరి సీనియారిటీ లిస్ట్ వారికే రూపోందించాల్సి ఉన్నాఅధికారులు కలిపి గందగోళం చేశారన్నారు. రేంజ్ లో ఉన్న ఇన్ స్పెక్టర్ పోస్టులను సీటి అధికారులకు గతంలో పనిచేసిన ఏపికి చేందిన డీజీపిలు అంటగట్టారని, దానివల్ల తమకు రావాల్సిన ప్రమోషన్లను సిటిలో ఉన్న వారికిచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్లతాము డీఎస్పీ పదోన్నతులకు అర్హత ఉన్నా బ్యాచ్ సీనియారిటి అని చెప్పి అన్యాయం చేస్తున్నారని 95 బ్యాచ్ అధికారులు హోంమంత్రి ఎదుట స్పష్టం చేశారు.