అంతరిక్షంలోకి దూసుకెళ్లిన మార్క్ 3డి1

SMTV Desk 2017-06-05 18:38:43  gslvmark3d1, sriharikota, zeesate-19,sathishdhava space center

శ్రీహరికోట, జూన్ 5 : భారత్ అత్యంత ప్రతిష్ఠత్మకంగా రూపొందించిన జీఎస్ఎల్ వీ మార్క్ 3 డీ 1ప్రయోగం విజయవంతం అయింది. శ్రీహరికోట షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుండి నిప్పులు కక్కుతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ప్రయోగం జరిగింది. ప్రయోగం కోసం 25.30 గంటల కౌంట్ డౌన్ సాగింది. ఇస్రో ఇప్పటి వరకు ప్రయోగించిన రాకెట్లలో కెళ్లా ఇదే అతిపెద్దది..శక్తివంతమైనది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజిన్ వినియోగించారు. రాకెట్ ద్వారా 3,136 కిలోల బరువుగల జీశాట్ -19 సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. రాకెట్ బరువు 640 టన్నులు, ఎత్తు 43 మీటర్లు. ఇందులో మూడుదశలు ఉంటాయి. మెుదటి దశలో ఎన్ 200 మోటార్లురెండు, రెండో దశలో ఎల్ 110 లిక్విడ్ కోర్ ఇంజిన్, మూడో దశలో సీ25 క్రయోజెనిక్ ఇంజిన్ ఉన్నాయి. ప్రయోగం అనంతరం 16.20 నిమిషాలకు జీశాట్ - 19 ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోనుంది. ఇది భూ అనువర్తిత బదిలీ కక్ష్య లోకి 4 వేల కిలోలను, దిగువ భూకక్ష్యలోకి 8వేల కిలోలను మోసుకెళుతుంది. జీశాట్-19 ఉపగ్రహంలో కేఏ బ్యాండు, కేయూ బ్యాండ్ ట్రాన్స్ ఫాండర్లు ఉన్నాయి.దీని ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తాయి.4జీ టెక్నాలజీ మరింత మెరుగు పడు తుంది.