"అర్జున్ రెడ్డి" తమిళ రీమేక్ లో స్టార్ హీరో

SMTV Desk 2017-09-19 17:03:22  Arjun reddy movie, Tamil remake, Hero Dhanush, Hero Arya.

హైదరాబాద్, సెప్టెంబర్ 19 : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన "అర్జున్ రెడ్డి" సినిమా రికార్డు స్థాయిలో ఘనవిజయం సాధించి, మంచి కలెక్షన్స్ సంపాదించిన విషయం విదితమే. ఇప్పుడా సినిమాను పలు భాషలలో రీమేక్ చేయడానికి దర్శక నిర్మాతలు తెగ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ లో ప్రముఖ హీరో రణవీర్ సింగ్.., కన్నడ రీమేక్ లో హీరో యష్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వదంతులపై చిత్ర బృందం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో “అర్జున్ రెడ్డి” సినిమా తమిళ రీమేక్ హక్కులను ధనుష్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి హీరో ఆర్య అయితేనే బాగా న్యాయం చేయగలడని ధనుష్ భావించి, వెళ్లి ఆర్యను సంప్రది౦చాడట. ఆయన కూడా ఈ చిత్ర౦ చేయడానికి అంగీకారం తెలిపినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అదే జరిగితే కోలీవుడ్ "అర్జున్ రెడ్డి" గా ఆర్య ప్రేక్షకులను అలరిస్తారన్నమాట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.