పలువురు సినీ ప్రముఖులకు మోదీ లేఖ..

SMTV Desk 2017-09-18 19:11:44  prime minister, narendra modi, directer S. S. Rajamouli, prabhas, mahesh babu, pawan kalyan.

హైదరాబాద్, సెప్టెంబర్ 18 : కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతలో భాగంగా తలపెట్టిన "స్వచ్ఛతే సేవ" కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు లేఖలు రాశారు. ఇందులో భాగంగా తెలుగు సినీ పరిశమ్రకు చెందిన దర్శకుడు రాజమౌళి, సినీ నటులు మోహన్‌బాబు, ప్రభాస్‌, మహేశ్‌బాబు తదితరులకు నరేంద్రమోదీ ఈ లేఖలు అందజేశారు. ఈ లేఖలో మోదీ.. " ఈ కార్యక్రమాన్ని మహాత్మాగాంధీ స్పూర్తితో చేపట్టాం. మన పరిసరాలను మనం శుభ్రం చేసుకోవడం పట్ల సమాజంలో మనకున్న వైఖరిని ప్రతిబింబిస్తుంది. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగం అవుతూ మరింత ఎక్కువ మంది ఇందులో పాల్గొనేలా ప్రోత్సహించాలి. స్వచ్ఛత కోసం మరింత ఎక్కువ సమయం కేటాయించాలి. ఇదే మనం బాపుకి ఇచ్చే అసలైన నివాళి". అంటూ పేర్కొన్నారు. కాని అత్యంత సాన్నిహిత్యం ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మోదీ లేఖ రాయకపోవడం చర్చనీయాంశంగా మారింది.