ఇక మీదట రైళ్లలో 10 తర్వాతే నిద్ర.. రైల్వేశాఖ కొత్త నిబంధన

SMTV Desk 2017-09-18 15:37:29   Reservation berth, Railway Ministry spokesperson Anil Saxena, Night time from 10 pm to 6 am

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 : రైళ్ళలో ప్రయాణికుల మధ్య జరుగుతున్న వాగ్వాదాలకు కళ్ళెం వేసే దిశగా రైల్వే వ్యవస్థ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. రైళ్లల్లో నిర్దేశి౦చిన సమయాలల్లో మాత్రమే రిజర్వేషన్‌ బెర్తుల్లో నిద్రించాలని ఆదేశిస్తూ.. తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. కొంతమంది రైలు ఎక్కడమే తడవుగా బెర్తుపై నిద్రించాలని కోరుకుంటుండడంతో ఇతర ప్రయాణికులు కూర్చునేందుకు సీట్లు ఉండడం లేదు. ఈ విషయంలో తరచూ రైళ్లో ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తమ దృష్టికి రావడం వల్ల నిద్రపోయే వేళల్ని మార్చినట్లు రైల్వే మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అనిల్‌ సక్సేనా తెలిపారు. ఇంతకు ముందు వరకు రిజర్వేషన్‌ బోగీల్లో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు నిద్ర వేళలు ఉండేవి. కాని వాటిని కుదించి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిద్ర వేళలుగా ప్రకటిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నిర్దేశించిన వేళల్లో పడుకున్న వారి సీటును అడగడానికి వీల్లేదని తాజా ఉత్తర్వు పేర్కొంది.