టీవీ షో పేరుతో షారుక్ ను బోల్తా కొట్టించిన అభిమాని

SMTV Desk 2017-06-05 17:44:46  sharook khan,TV show program,Ramesh under ground tv show

దుబాయ్, జూన్ 5 ‌: ఓ టీవీ షో కింగ్‌ఖాన్‌ షారుక్‌కే చుక్కలు చూపించింది. దాంతో షారుక్‌ ఆ షో నిర్వహించిన వారిపై దాడికి దిగారు. అసలేం జరిగిందంటే.. షారుక్‌ దుబాయ్‌ టూరిజం ప్రచార వీడియో చిత్రీకరణ కోసం దుబాయ్‌లోని సాండ్‌ డ్యూన్స్‌ నగరానికి వెళ్లారు. షారుక్‌ దుబాయ్‌ వచ్చారని తెలిసి ‘రమేజ్‌ అండర్‌ గ్రౌండ్‌’ అనే టీవీ షో బృందం షారుక్‌ని షోకి ఆహ్వానించింది. అందుకు షారుక్‌ కూడా ఒప్పుకున్నారు. అసలైతే అది నిజమైన టీవీ షో కాదు. షో పేరుతో సరదాగా ఆటపట్టించే కార్యక్రమం. ఈ విషయం తెలీక షారుక్‌ షోకి వెళ్లి ఇరుక్కున్నారు. తీరా షో జరుగుతున్న సెట్స్‌కి వెళ్లగానే షారుక్‌ గుంతలో పడిపోయారు. ఆయనతో పాటు అక్కడే ఉన్న యాంకర్‌ కూడా పడిపోయింది. అందులో నుంచి బయటికి రావడానికి యత్నిస్తుండగా అప్పుడే ఓ కొమొడో డ్రాగన్‌ మీదకు వచ్చింది. దాంతో షారుక్‌కి నిజంగానే గుండె ఆగినంత పనైంది. అప్పటికీ షారుక్‌ ఆ డ్రాగన్‌ నుంచి తెలివిగా తప్పించుకోవడానికి యత్నించారు. ఆ తర్వాత ఆ డ్రాగన్‌ ఎవరో కాదు షో వ్యాఖ్యాత అని షారుక్‌కి తెలిసింది. అంతే.. ఇలా టీవీ షో పేరు చెప్పి బెదరగొట్టారన్న కోపంతో షారుక్‌ వ్యాఖ్యాతను నేలకేసి చితకబాదారు. ఆ వ్యాఖ్యాత కూడా షారుక్‌కి వీరాభిమానే. ఇంకెప్పుడూ అలా చేయను వదిలేయండి అని వేడుకోవడంతో షారుక్‌ అతన్ని వదిలేశారు. ఆ తర్వాత షారుక్‌ కోపంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే టీవీ షో కాబట్టి షారుక్‌ కూడా వారిపై నిజంగానే కోపం వచ్చి వారిని చావగొట్టినట్లు నటించారా లేక నిజంగానే ఆయనకి కోపం వచ్చిందా అన్న విషయం తెలీయరాలేదు.