హాలీవుడ్ లో సైంటిస్ట్ పాత్ర చేయనున్న రానా

SMTV Desk 2017-09-16 20:07:27  rana, baahubali, vijil, hollywood movie

హైదరాబాద్ సెప్టెంబర్ 16: బాహుబలి తరువాత రానా క్రేజ్ నేషనల్ నుండి ఇంటర్నేషనల్ వరకు అంతట పెరిగిపోయింది. రానా త్వరలో ఒక హాలీవుడ్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. 1888వ సంవత్సరంలో ఒక ఓడ 700 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అలా బయలుదేరిన ఆ ఓడ కొన్ని రోజులకు అదృశ్యమైంది. ఆ ఓడ ఏమైంది? అలా అదృశ్యమవడానికి గల కారణాలేంటనే విషయాలపై పరిశోధన చేసే సైంటిస్ట్ పాత్రలో రానా కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలవబోతుంది. ఈ సినిమాకి ‘విజిల్’ అనే టైటిల్ ను పెట్టారు. ఈ సినిమాని బారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే రానా ఈ సినిమాతో ఇంకెన్ని రికార్డ్స్ కొడతాడో చూడాలి మరి.