"బిగ్ బాస్" హౌస్ లోకి మరో ఇద్దరు కథానాయికలు

SMTV Desk 2017-09-16 13:04:57  BIG BOSS SHOW, NTR HOST, RASHI KHANNA, NIVETHA THOMAS, JAI LAVA KUSA MOVIE.

హైదరాబాద్, సెప్టెంబర్ 16 : "బిగ్ బాస్" హౌస్ లోకి మరో ఇద్దరు కథానాయికలు అడుగుపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమానికి రేటింగ్ పడిపోతున్న వేళ ప్రముఖ కథానాయికలు నివేదా థామస్, రాశీఖన్నాలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు. ఎన్టీఆర్ సరసన ఈ ఇద్దరు భామలు కలిసి నటించిన "జై లవ కుశ" సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రసారం కానున్న షోలో ఈ ఇద్దరు హీరోయిన్స్ ప్రేక్షకులను అలరించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించడంతో ఈ ముగ్గురు నేడు బుల్లితెర మీద సందడి చేయనున్నారు. దీంతో ఈరోజు రాత్రి ప్రేక్షకులకు కన్నుల పండుగగా ఈ "బిగ్ బాస్" షో నిలువనుంది. అయితే ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ రికార్డ్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.