ఆధార్ తప్పనిసరి అంటున్న కేంద్ర ప్రభుత్వం

SMTV Desk 2017-06-05 17:31:11  government subsidy ,atal pension, aadhaar , kirosin

హైదరాబాద్, జూన్ 5 : కిరోసిన్ కొనుగోలుపై ప్రభుత్వ సబ్సిడీ పోదేందుకు ఇకపై ఆధార్ తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం స్వష్టం చేసింది. అంతే కాకుండా అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలకు ఆధార్ ను తప్పనిసరి అని వెల్లడించింది. కిరోసిన్ సబ్సీడి పొందుతున్నవారు, అటల్ పెన్షన్ యోజన ఖాతాదారులు తమ ఆధార్ నంబర్ సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఆధార్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని స్వష్టం చేశారు. కిరోసిన్ సబ్సిడీ పొందేందుకు సెప్టెంబర్ 30 లోగా ఆధార్ నంబర్ సమర్పించడం లేదా కార్డు కోసం పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన విషయానికి వస్తే .. గడువు తేదీని ఈ నెల 15గా నిర్ణయించారు. ఆధార్ కార్డు పొందేవరకు రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు, వ్యక్తి ఫోటోతో కూడిన కిసాన్ పాస్ బుక్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కార్డు, గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ జారీ చేసిన సర్టిఫికెట్ ను వ్యక్తిగత ధ్రువీకరణ పత్రంగా పరిగణించడం జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ రెండు పథకాల ప్రయోజనాలు పొందే వారి ఆధార్ నెంబర్లను రేషన్ కార్డు తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ప్రత్యేక్ష నగదు బదిలీ పరిధిలోకి వచ్చేవారి ఆధార్ నెంబర్ ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయనున్నారు.