యూట్యూబ్ లో రచ్చ చేస్తున్న తమన్నా ప్రోమో సాంగ్..!

SMTV Desk 2017-09-15 20:44:48  tamanna, jr ntr, jai lava kusa, babi, nivetha thamas, rasi khanna

హైదరాబాద్ సెప్టెంబర్ 15: ‘జై లవ కుశ’ చిత్రం ట్రైలర్ ఇప్పటికే కోటి వీవ్స్ ను దాటి దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో పాటను విడుదలైంది. ఈ పాటలో ఎన్టీఆర్, తమన్నా కలిసి చేసిన డ్యాన్స్ ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచింది. ‘అందం తిన్నానండి.. అందుకే ఇట్లా ఉన్నానండి’ అంటూ తమన్నా వేసిన స్టెప్ లు యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. ఆపాటలో ఎన్టీఆర్ చేసిన డ్యాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారంటే నమ్మండి..! ఇ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నివేత థామస్, రాశి ఖన్నా లు కథానాయికలుగా నటించగా కే.ఎస్. రవీంద్ర (బాబీ) ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.