స్పీడ్ ఎలివేటర్.. మేడ్ ఇన్ జపాన్

SMTV Desk 2017-06-05 17:26:00  elivator, china, made in japan, speed elivator

బీజింగ్, జూన్ 5 : ప్రపంచంలోనే వేగంగా నడిచే ఎలివేటర్ ను చైనాలో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమిషానికి 1,260 మీటర్ల రికార్డు వేగంతో ఇది పనిచేయనున్నది. గాంగ్జౌ సీటీఎఫ్ ప్రావి న్స్ సెంటర్ లోని ఓ ఆకాశహర్మ్యంలో ఏర్పాటు చేయనున్న ఈ ఎలివేటర్ ను జపాన్ కంపెనీ హిటాచీ తయారు చేసింది. అధునాతన బ్రేకింగ్ వ్యవస్థ, ఉష్ణ నిరోధకత వంటి ఫీచర్లుకూడా దీనిలో ఉన్నాయి. వేగంగా నడిచే ఎలివేటర్ కార్ లో ఉన్నప్పుడు చెవులకు అసౌకర్యం కలుగకుండా, వాయిపీడన మార్పిడి పరికరం కూడా ఇందులో అమర్చి ఉంటుంది. వైబ్రేషన్ కు గురికాకుండా గైడ్ రోలర్స్ ను ఈ ఎలివేటర్ లో వాడారు. గత ఏడాది మే లో నిమిషానికి 1200 మీటర్ల వేగంతో ఓ ఎలివేటర్ ను చైనాలో ఏర్పాటు చేశారు. దానిని మించిన వేగంతో ప్రస్తుతం ఏర్పా టు చేయబోయే ఎలివేటర్ పనిచేయనున్నది.