హెచ్‌-1బీ వీసాల జారీపై పరిమితుల్లేవు: అమెరికా

SMTV Desk 2017-09-15 16:33:55  H-1B visa, President of the United States Donald Trump, India,

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 : హెచ్‌-1బీ వీసా కార్యక్రమాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సమీక్షిస్తునంత మాత్రాన భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ అమెరికా సీనియర్ అధికారి వెల్లడించారు. హెచ్‌-1బీ వీసా జారీపై పరిమితుల్లేవని ఆయన స్పష్టం చేశారు. గత 9 నెలల్లో జారీ అయిన మొత్తం హెచ్‌-1బీ వీసాలో భారతీయులకే 70 శాతం కేటాయించారు. భారతీయులకు అందుతున్న హెచ్‌-1బీ, ఎల్‌-1బీ వీసాలలో ఏటా 6 శాతం పెంపు ఉంటుందని వివరించారు. దౌత్య సంబంధాలపై వాషింగ్టన్ లో ఈ నెల 27న భారత్, అమెరికా జరపనున్న ద్వైపాక్షిక చర్చల్లో హెచ్‌-1బీ వీసా కోత విధించే అంశమేదీ చర్చకు రాలేదని ఆయన పేర్కొన్నారు