175స్థానాల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం: పురంధేశ్వరి

SMTV Desk 2017-09-15 16:06:08  BJP, Daggubati Purandeswari, TDP, AP BJP

అమరావతి, సెప్టెంబర్ 15: కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇటీవల జరిగిన ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పొత్తుల విషయంపై మా పార్టీ అధిష్టానంమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే ప్రస్తుతం భాజపా అధ్యక్షుడు అమిత్ షా 175స్థానాల్లో పార్టీని బలోపేతం చేయమని పిలుపునిచ్చారని ఆమె తెలిపారు. తెదేపాతో మితృత్వం కొనసాగుతుందని, రాబోయే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని ఆమె అన్నారు. కాగా తండ్రి స్థానంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర అభివృద్ధికి కావలసిన నిధులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రాష్ట్రానికి అన్నీ విధాల ఆదుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అబివృద్ధి దిశగా ఎల్లవేళలా సిద్ధంగా ఉందని ఆమె వెల్లడించారు.