కెన్ ఐ హెల్ప్ యూ!!!

SMTV Desk 2017-06-05 17:06:03  airports, robos, sitha, kiysoki,

బ్రస్సెల్స్, జూన్ 5 : విమానాశ్రయాల్లో ప్రయాణికులు చెక్ ఇన్ కోసమై గంటల తరబడి నిలువాల్సిన పరిస్థితిలు త్వరలో దూరం కావచ్చు. ప్రయాణికులకు సహాయం చేసే చెక్ ఇన్ రోబోను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. త్వరలో పూర్తి స్థాయిలో వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయాలకు ఐటీ, టెలికమ్యూనికేషన్ల సేవలందించే సీత కంపెనీకి చెందిన పరిశోధకులు ఈ రోబోను అభివృద్ధి చేస్తున్నారు. కేట్ కియోస్క్ గా పిలువబడే ఈ రోబో స్వతంత్రంగా, రోబోల బృందాలతో కలిసి కూడా పనిచేయగలదు. విమానం, ప్రయాణికుల రద్దీ సమాచారం సహాయంతో విమానాశ్రయంలోని ప్రయాణికుల రద్దీగా ఉన్న ప్రాంతాన్ని కేట్ కియోస్క్ రోబో గుర్తిస్తుంది. అందుకు అనుగుణంగా తనిఖీ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ఉన్న మార్గంలో రోబో కదులుతుంది. చెక్ ఇన్ కేంద్రాలు ఎక్కడున్నాయో వారికి తెలుపుతుంది. ప్రస్తుతం మూడు కియోస్క్ లను తయారు చేశామని, అందులో ఒక దాన్నిత్వరలో భారత్ కు పంపుతామని ఆ కంపెనీ వెల్లడించింది.