డేరా బాబా పారిపోవడానికి పోలీసుల స్కెచ్

SMTV Desk 2017-09-15 12:20:27  GURMITH SINGH BABA,

చండీఘర్, సెప్టెంబర్ 15 : అత్యాచారాల కేసులో ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్న గుర్మీత్ సింగ్ బాబా పోలీస్ స్టేషన్ నుండి పారిపోయేందుకు పోలీసులే పథక రచన చేసి ఆయనకు చెప్పినట్లు సమాచారం. ఈ సమాచారం తెలుసుకున్న హర్యానా పోలీసు యంత్రాంగం ఆ ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు పోలీసులు కలిసి గుర్మీత్ తో ఎలా పారిపోవచ్చన్న విషయంపై చర్చించారని, అంతేకాకుండా ఆయనకు కల్పించిన భద్రత, తీసుకెళ్లిన రూట్ వంటి వివరాలను బాబాకు తెలిపి గుర్మీత్ పారిపోవడానికి పక్కా ప్రణాళికలను రచిస్తూ కుట్ర పన్నినట్లు తెలిపారు. దీంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి వీరికి మూడు రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణను కొనసాగిస్తున్నారు.