పెట్టుబడుల సాధనలో తెలంగాణ రాష్ట్రం ముందంజ

SMTV Desk 2017-09-15 11:37:12  telangana state, assocham report, assocham report telangana

హైదరాబాద్ సెప్టెంబర్ 15: తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల సాధనలో ఇతర రాష్ట్రాల కంటే ముందు ఉన్నట్లు అసోచం తన నివేదికలో ప్రకటించింది. జాతీయ స్థాయిలో సగటున సాధించాల్సిన పెట్టుబడుల కంటే ఈ రాష్ట్రం అధిగమించడం జరిగిందని, తెలంగాణలోని పెట్టుబడిదారులకు ప్రభుత్వం స్నేహపూరిత విధానాలు అవలంభించడం వ‌ల్లే ఈ వృద్ధి సాధ్యమైంద‌ని వెల్లడించింది. పెట్టుబ‌డుల సాధ‌న‌లో తెలంగాణ‌ ఐదేళ్లలో 79 శాతం వృద్ధిని సాధించగా, మ‌రోవైపు ఇదే ఐదేళ్లలో జాతీయ స్థాయిలో ఈ వృద్ధిరేటు 27 శాతంగా న‌మోదైందని పేర్కొంది. తెలంగాణ‌కు 2011-12లో రూ. 3.03 ల‌క్షల కోట్లు పెట్టుబడులు రాగా, 2016-17లో రూ.5.09 ల‌క్షల కోట్లు పెట్టుబ‌డుల రూపంలో చేకూరాయని అసోచామ్ త‌న‌ నివేదిక‌లో తెలిపింది.