ఆసక్తిని రేకెత్తిస్తున్న "స్పైడర్" ట్రైలర్

SMTV Desk 2017-09-15 11:32:21  spider movie trailer, prince Mahesh babu, Rakul preeth singh, Audience.

హైదరాబాద్, సెప్టెంబర్ 15 : ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా "స్పైడర్" పట్ల అభిమానులలో రోజురోజుకి ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇటీవల విడుదల చేసిన టైటిల్ సాంగ్ తన కూతురు సితారకు బాగా నచ్చిందంటూ ఆమె పాడుతూ ఉంటె తీసిన వీడియోను నమ్రత పోస్ట్ చేసిన విషయం విదితమే. ఆ పాట ప్రేక్షకులకు కూడా బాగా నచ్చడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందోనన్న ఆత్రుత వారిలో పెరిగిపోతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ ఒక కొత్త లుక్ లో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను సినీ యూనిట్ విడుదల చేసింది. దీనిలో లవ్, యాక్షన్, ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. డైలాగ్స్ చాలా కొత్తగా, సహజంగా అనిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ నెల 27 న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్దంగా ఉందని చిత్ర యూనిట్ తెలియజేసింది.