‘రాజా ది గ్రేట్’ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తున్న రాశీ ఖన్నా

SMTV Desk 2017-09-15 08:36:23  rasikhanna, raja the great, raviteja, mehreen, anilravipudi, jailavakusa,

హైదరాబాద్ సెప్టెంబర్ 15: రవితేజ, మెహ్రీన్ జంట నటిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్’, ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రాశికన్నా అతిథి పాత్రలో నటించడానికి ఒప్పుకుంది. ‘నా అభిమాన దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న రాజా ది గ్రేట్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నానని ఈ ముద్దు గుమ్మ పేర్కొంది. తాజాగా రాశీ ఖన్నా ఎన్టీఆర్ నటించిన లవకుశ హీరోయిన్ గా ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో లవ పాత్ర కి హీరోయిన్ గా నటిస్తుంది.