మెగా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న రెహ్మాన్

SMTV Desk 2017-09-14 18:45:34  SAIRA NARASIMHAREDDY MOVIE, MEGASTAR CHIRANJEEVI, AR RAHMAN, DIRECTOR SURENDER REDDY.

హైదరాబాద్, సెప్టెంబర్ 14 : మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి" ని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన నయనతార నటిస్తుండగా, ప్రముఖ పాత్రల్లో అమితాబ్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎ.ఆర్. రెహ్మాన్ ను అనుకున్నారు. కాని ప్రస్తుతం కొన్ని పనులతో బిజీగా ఉన్న రెహ్మాన్, తన పూర్తి సమయాన్ని అక్కడే కేటాయించాల్సి వస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వస్తు౦దని చెప్పినట్టు సమాచారం. కాని ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.