డైరెక్టర్ కోసమే ఇలా చేస్తున్నా

SMTV Desk 2017-09-14 16:46:03  heroine Raashi Khanna, special song, raja the great movie, director anil ravipudi, raviteja

హైదరాబాద్, సెప్టెంబర్ 14 : సినిమాల్లో స్పెషల్ సాంగ్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో స్పెషల్ సాంగ్స్ చేస్తున్న వరుస కథానాయికల జాబితాలో రాశీఖన్నా కూడా చేరిపోయింది. సాధారణంగా అయితే హీరో కోసం హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లో నర్తించడానికి ఒప్పుకుంటారు. కాని రాశీఖన్నా మాత్రం డైరెక్టర్ కోసం స్పెషల్ సాంగ్‌ చేయడానికి ఒప్పుకోవడం విశేషం. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ, అందాల భామ మెహ్రీన్ లు జంటగా నటిస్తున్న "రాజా ది గ్రేట్" చిత్రంలో రాశీఖన్నా ప్రత్యేక గీతంలో నర్తించనుంది. దీనిపై రాశీ స్పందిస్తూ... మై డియర్ లవ్లీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కోసం స్పెషల్ సాంగ్ చేస్తున్నా" నని ట్వీట్‌ చేసింది. దీనికి డైరెక్టర్ అనిల్ "వెల్‌కమ్ టు మై వరల్డ్" అని రీ-ట్విట్ చేశారు.