కిందపడిన పగలని స్మార్ట్ ఫోన్లు

SMTV Desk 2017-06-05 16:39:41  smartphone, uk, queen university, landon,

లండన్, జూన్ 5 : కిందపడినా...కోపంతో విసిరేసినా పగలని స్మార్ట్ ఫోన్లు రాబోతున్నాయి. ఇందుకోసమై అద్భుతమైన ఆవిష్కరణలు నిర్వహిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ తయారు చేసేందుకు అటువంటి పదార్థాన్ని తయారు చేయడంలో యూకే లోని క్వీన్స్ యూనివర్శిటి పరిశోధకులు దాదాపు విజయం సాధించారు. మెరుగైన రసాయన స్థిరత్వం, కాంతి, ఫ్లెక్సిబిలిటి సహాయంతో శాస్ర్తవేత్తలు అద్భతమైన మెటీరియల్ ను ఆవిష్కరించారు. ఆ మెటీరియల్ తో తయారు చేసిన స్మార్ట్ ఫోన్లు కిందపడేసినా, విసిరేసినా పగిలే అవకాశం దాదాపుగా ఉండదనే చెప్పొచు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లను సిలికాన్ అనే పదార్థంతో తయారు చేస్తున్నారు. ఈ రకం ఫోన్లు ఖరీదైనవి కావడంతో పాటు కిందపడితే సులభంగా పగిలి పోతాయి. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల స్మార్ట్ ఫోన్లు విక్రయమయ్యాయి. మన్నికయ్యే, తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే స్మార్ట్ ఫోన్లను వినియోగదారులకు అందించాలని తయారీ దారులు భావిస్తున్నారు. యూకే లోని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు గ్రాఫీన్ వంటి లేయర్ల మెటీరియల్ తో సెమీకండక్టింగ్ అణువులను కలపడం ద్వారా విశిష్టమైన మెటీరియల్ టెక్నాలజీని కనుగొన్నామని వివరించారు. స్మార్ట్ పరికరాల ప్రపంచంలో ఇది పెనుమార్పులు తీసుకువస్తుందని పేర్కొన్నారు.